75 నగరాల్లో ఉపాధ్యాయులకు సెంటా పోటీలు

. హైదరాబాద్‌ : భార‌త‌దేశ‌ వ్యాప్తంగా బోధ‌న‌లో నైపుణ్యతను పెంపొందించ‌డమే ల‌క్ష్యంగా సెంటా కృషిచేస్తోంది. సెంట‌ర్ ఫ‌ర్ టీచ‌ర్ అక్రిడిటేష‌న్(సెంటా), టీచింగ్ ప్రొఫెష‌న‌ల్స్ ఒలంపియాడ్(టీపీఓ)లు కలిసి సంయుక్తంగా భారతదేశంలో ఉన్న ఉపాధ్యాయులకు వారి నైపుణ్యాలను వెలికి తీసేందుకు ప్రతీ ఏటా వార్షిక పోటీలను నిర్వహిస్తుంటాయి. ఈ సందర్భంగా డిసెంబర్‌14, 2019న భారతదేశ వ్యాప్తంగా ఉన్న 75 నగరాల్లో ఈ పోటీలను నిర్వహించనున్నారు.



ఈ మేరకు సెంటా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని ఘనంగా సన్మానించనుంది. అదే విధంగా పోటీలో విజేతలుగా నిలిచినవారికి రూ. లక్ష నగదుతో పిటు రిలయన్స్‌ ఫౌండేషన్‌ టీచర్‌ అవార్డును అందించనున్నారు. అదేవిధంగా టీపీవో ధృవీకరణ పత్రంతో పాటు, యూకేలోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో మాస్టర్‌ క్లాస్ హాజ‌ర‌య్యేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది.